మన వేదంకు సుస్వాగతం


మన వేదం, ఇదిఅందరి వేదం. ముందుగా ఎందరో మహానుభావులు ఆందరికీ వందనాలు. ఈ వేదం అనే పదాన్ని, పదార్ధాన్ని, ఒక అనన్య సామాన్య దివ్య మార్గాన్నిఉపడేశించిన మహానుభావులందరికీ వందనం. అసలు వేదం అంటే సుగమమైన మార్గం అని అర్ధం ఒక జీవీ లేదా పదార్థం ఎలా ఉండాలో ఎలా ఉంటే ఆది ఉపయోగ పడుతుందో దానిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలో చెప్పే బ్రహ్మ రహస్య నియమమే వేదం.

వేదం ఇది అందరిది. ఏ కొందరిదో ఒక జాతిదో, ఒక మార్గానిధో మాత్రం కాదు. దీనికి లిపి , భాష లేదు. కేవలం నియమం, పద్దతి మాత్రమే ఉన్నాయి. ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, వైద్యశాస్త్రం, జీవశాస్త్రం, ఇలా అన్నీ వేదం నుంచి వచినవే. మన భారతదేశం, భారతీయ సంస్కృతి అన్నీ ఖర్మ భూమి. ఖర్మను బట్టి ఆయా కార్యాలు నెరవేర్చుకుంటాం. అలాంటి ఖర్మలను క్రమబద్దంగా ఎలా, ఎప్పుడు, అనుసరించాలో చెప్పే వేదాలు మనకు నాలుగు అందుబాటులో ఉన్నాయి. అవి

౧. ఋగ్వేదం.
౨. యజుర్వేదం.
౩. సామావేదం.
౪. అధర్వణవేదం

ఇవి మనకు మహర్షులు, యోగులు, ఎన్నో యుగాలు తపస్సు చేసి మనకు అందించారు. ఈ కాలానికి మనకు ఇవి వ్యాస భగవానులు, శంకర భగావత్పాదుల వలన అందించబడ్డాయి. అందుకే వారు మనకు సదా సద్గురువులు, భగవాన్ స్వరూపులు. ఈ నాలుగు వేదాలు మనకు ఋగ్వేదం మన జీవ జాలం ఎలా ఉద్దరించింది? ఎలా మనుగడ సాగించాలి? ఎప్పుడు ఏ కాలం ఎలా ఉంటుంది? ఆహారం, ఆహార్యం, కట్టు, బొట్టు అన్ని చెబుతుంది.

 

ఈ వెబ్సైటు ద్వారా మేము అందరికి కావలసిన వైధిక సంభంధమైన మంత్రాలు ఉచితంగా అందచేయాలనుకుంటున్నాము.  దీనికి సహకరించిన వారికందరికి కృతజ్ఞతలు.

 

ధర్మ సందేహాలు

స్తోత్రములు

అష్టకములు

కవచములు